Donation | అమీర్‌పేటలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ స్కూల్లో ఇటీవల ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను ఆదర్శ ఫౌండేషన్‌కు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి ఆదర్శ ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడి చిన్నారులకు సామాగ్రి, భోజనాన్ని పంపిణీ చేశారు.
స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత్వం, సేవా భావం ఎంత ముఖ్యమో చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని స్కూల్ మేనేజ్ మెంట్ తెలిపింది.
BRS | రాజేంద్ర నగర్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన
Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ