Philippines | సోషల్ మీడియా వీడియో కోసం హానికర పీతలు తిన్న ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్.. మృతి
Philippines : సోషల్ మీడియాలో వీడియోలు, లైకులు, కామెంట్ల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్తితి. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక మహిళ ఇలా సోషల్ మీడియా కోసం వీడియో తీసి, ప్రాణాలు కోల్పోయింది.
Philippines : సోషల్ మీడియాలో వీడియోలు, లైకులు, కామెంట్ల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్తితి. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక మహిళ ఇలా సోషల్ మీడియా కోసం వీడియో తీసి, ప్రాణాలు కోల్పోయింది. వీడియో కోసం విషపూరిత పీతలు తిని మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థ తెలిపింది.
ఫిలిప్పీన్స్, ప్యూర్టో ప్రిన్సెసా, పలావాన్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫుడ్ వ్లాగర్ అయిన ఎమ్మా అమిత్ అనే (51) మహిళ దగ్గర్లోని ఒక నదిలో డెవిల్ క్రాబ్స్ను పట్టుకుంది. డెవిల్ క్రాబ్స్ రకం పీతలు చాలా విషపూరితమైనవి. వీటిని ఎవరూ తినరు. ఆ విషయం కూడా ఆమెకు తెలుసు. అయితే, తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు వీడియో రూపొందించడం కోసం ఈ పీతల్ని తిన్నది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కోసం ఈ పీతల్ని పట్టుకుని, కొబ్బరి పాలతో కలిపి ఫిబ్రవరి 4న వంట చేసుకుని తిన్నది. అయితే, ఆ మరుసటి రోజే ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. మూర్ఛ రావడం, పెదవులు నీలి రంగులోకి మారడంతోపాటు స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఎమ్మా ఈ నెల 6న ఆస్పత్రిలో మరణించింది.
ఆమె మరణంపై స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మా, ఆమె భర్త తీర ప్రాంతంలోనే ఉంటారని, వారికి చేపలు, ఇతర సీ ఫుడ్ గురించి బాగా తెలుసని వారు అంటున్నారు. ఇంత అవగాహన ఉన్నా కూడా ఆమె డెవిల్ క్రాబ్స్ను ఎందుకు తిన్నదో అని విస్మయం వ్యక్తం చేశారు. వీటిని వండినంత మాత్రాన అందులోని విషం తొలగిపోదని, ఇవి తింటే పక్షవాతం రావడంతోపాటు ప్రాణాలు కూడా పోతాయని వారు అంటున్నారు. ఏదేమైనా ఒక వీడియో కోసం ఎమ్మా అమిత్ విషాహారం తిని ప్రాణాలు కోల్పోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

