January 12 Vidudala | టాలీవుడ్లో బ్లాక్బస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. బావ బామ్మర్ది సౌజన్యంతో అనేది ఉప శీర్షిక.
ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ఎంటి అర్చన సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కుటుంబ కథాంశంతో సాగే ఈ వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.