Kiren Rijiju: స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎంపీల అరుపులు.. వీడియో రిలీజ్ చేసిన మంత్రి రిజిజు
Kiren Rijiju: లోక్సభ స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎంపీలు తిట్ల పర్వం కొనసాగించారు. ఓ ఎంపీ తన వేలెత్తి చూపి మంత్రిపై గట్టిగా అరిచారు. ఈ ఘటనకు చెందిన వీడియోను మంత్రి రిజిజు రిలీజ్ చేశారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రోజు రోజుకూ వైరం పెరుగుతున్నది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) ఇవాళ మరో వీడియోను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి గట్టిగా అరిచారు. ఆ వీడియోను కాంగ్రెస్ ఎంపీలే తీసినట్లు మంత్రి రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి .. కేంద్ర మంత్రి రిజిజు వైపు తన వేలెత్తి చూపి గట్టిగా అరిచినట్లు ఆ వీడియోలో ఉన్నది.
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సభలో మాట్లాడిన రోజున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రసంగంలో మాజీ ప్రధానులను విమర్శించారు. నెహ్రూ-గాంధీ కుటుంబంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సభకు పుస్తకాలు తీసుకువచ్చిన దూబే.. ఆ పుస్తకాల్లో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయన నెహ్రా-గాంధీ ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన నేపథ్యంలో ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి దూబేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓ బుక్ నుంచి అంశాన్ని ప్రస్తావిస్తే వ్యతిరేకించారని, కానీ దూబే కొన్ని బుక్స్ నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
స్పీకర్ ఛాంబర్లో జరిగిన రభస గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు స్పందిస్తూ కాంగ్రెస్ నేతల ప్రవర్తనను విమర్శించారు. ప్రియాంకా, వేణుగోపాల్ లాంటి సీనియర్ నేతల ముందు అలా జరగడం శోచనీయమన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదని రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన మారుతుందని కానీ, కాంగ్రెస్ మారుతుందని కానీ ఆశించడం లేదని రిజిజు తెలిపారు. ఆ రోజున సుమారు 25 మంది ఎంపీలు స్పీకర్ ఛాంబర్లోకి వచ్చారని, తనను.. ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారని, కానీ తమ పార్టీ చర్చలను నమ్ముతుందని, ఎంపీలపై భౌతికదాడిని తాము ఎప్పుడూ ప్రోత్సహించలేదని రిజిజు తన పోస్టులో తెలిపారు.
This is the illegal video clip taken by a Congress MP when 20-25 Congress MPs entered the Chamber of Hon’ble Speaker, abused him and threatened Honb’le Prime Minister. Our party believes in debate & discussion and never encourage MPs to threaten physically. https://t.co/bezzALc7D3 pic.twitter.com/iM0a50Z4rg
— Kiren Rijiju (@KirenRijiju) February 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

