Mohammad Nadeem : పొట్టి ప్రపంచకప్‌లో చిన్న జట్లు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాయి. విశ్వవేదికపై పెద్ద టీమ్‌లకు షాకిచ్చేందుకు పసికూనలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు రికార్డులు నెలకొల్పుతున్నారు. తమ గ్రూప్ బీ రెండో మ్యాచ్‌లో ఒమన్ బ్యాటర్ మొహమ్మద్ నదీమ్ (Mohammad Nadeem) చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అర్ధ శతకం బాదిన అత్యధిక వయస్కుడిగా రికార్డున లిఖించాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్ ఆటగాడు మొహమ్మద్ నదీమ్ కలకాలం గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు. కో-హోస్ట్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సహచరులు డగౌట్ చేరుతున్నా.. క్రీజులో పాతుకుపోయిన నదీమ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లంక పేస్, స్పిన్ దళాన్ని సమర్ధంగా కాచుకున్న అతడు అజేయంగా నిలిచాడు. ప్రపంచకప్‌లో యాభై కొట్టిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు తన పేరిట రాసుకున్నాడు నదీమ్.
At 43 years and 161 days, Mohammad Nadeem becomes the oldest to score a fifty at any men’s T20 World Cup 👴
He surpasses Sanath Jayasuriya – his opposition’s coach – who was 39 years and 345 days old when he scored 81 against the West Indies in 2009 pic.twitter.com/jDpvRynp43
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2026
గురువారం నాటికి అతడికి 41 ఏళ్ల161 రోజులు. తద్వారా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) పేరిట ఉన్న రికార్డును నదీమ్ బ్రేక్ చేశాడు. 2009 సీజన్లో జయసూర్య.. వెస్టిండీస్‌పై అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పాడు. అప్పుడు అతడి వయసు 39 ఏళ్ల345 రోజులు. ప్రస్తుతం ఈ వెటరన్ ఆటగాడు లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలిందిస్తున్న విషయం తెలిసిందే.
తొలి పోరులో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన ఒమన్ గురువారం శ్రీలంక ధాటికి చేతులెత్తేసింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లను కట్టడి చేయలేక 225 పరుగులు సమర్పించుకున్న ఒమన్.. భారీ ఛేదలో తడబడింది. మహీశ థీక్షణ(2-11) దుష్మంత్ చమీర(2-19)లు రెండేసి వికెట్లతో విజృంభించగా.. మొహమ్మద్ నదీమ్ (53 నాటౌట్), వసీం అలీ(27)లు పోరాడారు. కానీ, మిగతా వారు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. 120కే ఒమన్ లౌటయ్యింది. 105 పరుగుల తేడాతో గెలిచిన లంక గ్రూప్ బీ నుంచి అగ్రస్థానంలో నిలిచింది.
Standing tall against Sri Lanka, Nadeem has been Oman’s silver lining despite the falling wickets. 👏
ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW pic.twitter.com/edyOy6Map6
— Star Sports (@StarSportsIndia) February 12, 2026