తిరుమల : చెన్నైకు చెందిన జీ స్కోయర్ రియల్టర్స్ ఎండీ బాలా రామజయమ్ గురువారం టీటీడీ ( TTD ) కి రూ.33 లక్షల విలువైన ఐదు బ్యాటరీ బగ్గీలను ( Battery Buggies ) విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తాళాలను అందజేశారు.
ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళం

టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కుప్పాల నీలేష్ కుమార్ అదనపు ఈవోకు అందజేశారు.