చందంపేట, ఆగస్టు 06 : రూ.2 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నేరేడుగొమ్ము – కలకొండతండా బీటీ రోడ్డు (బ్యాలెన్సింగ్ వర్క్) నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. ముఖ్యంగా రైతులు తమ పంటలను పొలాల నుండి మార్కెట్కు వేగంగా తరలించేందుకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని, వ్యవసాయ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన ప్రజలు ఆసుపత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసిలు సీనియర్ నాయకుడు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, పరిసర గ్రామాల సర్పంచులు, కొప్పుల సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, వార్డు మెంబర్లు, రామావత్ మోహన్ పాల్గొన్నారు.

నేరేడుగొమ్ము- కలకొండతండా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన