Rachin Ravindra | న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. టీమిండియాతో సిరీస్‌కు యువ ఓపెనర్ డౌటే..!
Rachin Ravindra : టీమిండియాతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) అనూహ్యంగా గాయపడ్డాడు. డైవింగ్ క్యాచ్ పట్టే క్రమంలో అతడి కుడి భుజం కాస్త పక్కకు జరిగింది.
Rachin Ravindra : టీమిండియాతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) అనూహ్యంగా గాయపడ్డాడు. డైవింగ్ క్యాచ్ పట్టే క్రమంలో అతడి కుడి భుజం కాస్త పక్కకు జరిగింది. ప్రమోషనల్ షూట్ కోసం అతడు బౌండరీ లైన్ సమీపంలో క్యాచ్ అందుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. దాంతో.. భుజం స్థానభ్రంశం చెందడంతో అతడు త్వరలో టీమిండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
స్వదేశంలో టీ20 సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు ఊహించని షాక్. భారత జట్టుతో కీలకమైన ఐదు మ్యాచ్‌ల్లో యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఆడడం అనుమానమే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ చిచ్చరపిడుగు అనుకోకుండా మైదానంలో గాయపడ్డాడు. ఆక్లాండ్‌లో బుధవారం (సెప్టెంబర్ 16)న ఓ ప్రమోషనల్ షూట్ కోసం అతడు డైవింగ్ క్యాచ్ పట్టబోయాడు. కుడివైపు డైవ్ చేస్తూ బంతిని అందుకునే క్రమంలో అతడు సేఫ్టీ మ్యాట్‌పై పడిపోయాడు. దాంతో.. నొప్పితో విలవిలలాడిన రచిన్‌కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా కుడి భుజం స్థానభ్రంశం చెందిందని వైద్యులు తెలిపారని కివీస్ పర్ఫార్మెన్స్ మేనేజర్ మైక్ సాండ్లే (Mike Sandle) వెల్లడించాడు.
“It was a bit of a freak accident”
Rachin Ravindra dislocated his right shoulder while attempting a diving catch during a promotional shoot in Auckland 🤕 pic.twitter.com/ouliLnQnqU
— Cricinfo (@cricinfo) September 19, 2026
‘ఓ షూట్ కోసం క్యాచ్ అందుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ రచిన్ గాయపడ్డాడు. అందుకు మాకు చాలా బాధగా ఉంది. అతడు త్వరగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాం. ఆటగాళ్ల అంగీకారంతోనే కమర్షియల్ షూట్ నిర్వహిస్తాం. ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకుంటాం. కానీ, రచిన్ అనుకోకుండా గాయపడ్డాడు. భవిష్యత్‌లో ప్రమోషన్ షూట్ సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని సాండ్లే పేర్కొన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ పునరావాస కేంద్రంలో ఉన్న అతడు ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? అనేది తెలియాల్సి ఉంది.

అక్టోబర్ 22న తొలి మ్యాచ్
అక్టోబర్‌లో పొట్టి సిరీస్ కోసం భారత జట్ట న్యూజిలాండ్ వెళ్లనుంది. అక్కడ ఇరు జట్లు ఐదు టీ20ల్లో తలపడనున్నాయి. అక్టోబర్ 22న హేగ్లే ఓవల్ మైదానంలో తొలి మ్యాచ్‌తో సిరీస్ మొదలవ్వనుంది. అయితే.. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ ఇంకా స్క్వాడ్‌ను ప్రకటించలేదు. సెప్టెంబర్ మూడో వారంలో బృందాన్ని ఎంపిక చేస్తారని సమాచారం. వారం రోజుల్లో రచిన్ రవీంద్ర కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది. అదే జరిగితే.. భారత్‌పై మెరుగైన రికార్డున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడకపోవడం కివీస్‌కు పెద్ద లోటేనని అంటున్నారు నిపుణులు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

