Donald Trump | ‘వాళ్ల నిఘా మాపై మా నిఘా వాళ్లపై’.. జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు ముందు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Donald Trump | చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) త్వరలో సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బీజింగ్ (Beijing) ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా-అమెరికా (China-America) మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. అదే సమయంలో ఇరుదేశాలూ పరస్పరం గూఢచర్యం చేసుకుంటాయని పేర్కొన్నారు.
Donald Trump : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) త్వరలో సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బీజింగ్ (Beijing) ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా-అమెరికా (China-America) మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. అదే సమయంలో ఇరుదేశాలూ పరస్పరం గూఢచర్యం చేసుకుంటాయని పేర్కొన్నారు.
గతంలో తమ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘అగ్రరాజ్యంపై చైనా గూఢచర్యం చేస్తోందని’ చెప్పారని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అయితే తాము కూడా బీజింగ్ విషయంలో అదే పని చేస్తుండడంతో దాన్ని అంతగా పట్టించుకోలేదని తెలిపారు. జీ జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాకు వస్తారని, ఇతర దేశాల సంబంధాలు అంత బాగా లేకపోయినా మాకు చైనాతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయనతో సమావేశానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.
ఆ చర్చల్లో పలు కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నామని, ప్రతి ఒప్పందం వెనక ఓ స్పష్టమైన ఉద్దేశం ఉంటుందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెలాఖరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. సతీమణి పెంగ్ లియువాన్‌తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ట్రంప్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరీ ఆయనను స్వాగతించనున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీకి సమీపంలోని సైనిక స్థావరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి జిన్‌పింగ్ దంపతులను అధ్యక్షుడు స్వాగతించే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలతో ప్రముఖ టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్, మైఖేల్ డెల్, జెఫ్ బెజోస్, జెన్సన్ హువాంగ్, శామ్ ఆల్ట్‌మన్, జేన్ ఫ్రేజర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో కృత్రిమ మేథపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

