అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలాకాలంగా హాజరుకావడం లేదు. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ జగన్, ఆయన పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. అయితే సభలో 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. అనంతరం నిరసన వ్యక్తంచేసి సభ నుంచి వెళ్లిపోయారు.
దీనిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు కొద్దిసేపే సభలో ఉండి వెళ్లిపోవడంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ‘11వ తేదీన, 11 మంది, 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు! అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా..!’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని హితవు పలికారు.