బూర్గంపహాడ్, జూలై 28 : బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా పంచాయతీ అధికారిణి(డీపీవో) అనూష ఆరా తీశారు. మంగళవారం ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి కార్యదర్శి సంపత్ శ్రీనివాస్‌ను పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనులు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న పాల్గొన్నారు.