IPL 2026 | ఐపీఎల్‌కు ఎన్నికల సెగ.. 19వ సీజన్ షెడ్యూల్ అలస్యం..!
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. షెడ్యూల్‌పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్‌పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. మామూలుగా అయితే ఈ లోపే షెడ్యూల్ విడుదలవ్వాలి. కానీ, బీసీసీఐగానీ, ఐపీఎల్ పాలకమండలిగానీ ఐపీఎల్ షెడ్యూల్ గురించి ఒక్క ప్రకటన చేయలేదు. ఆనవాయితీ ప్రకారం మార్చి – మే నెల మధ్యలో మెగా టోర్నీ జరుగనుందని సమాచారం. కానీ, షెడ్యూల్‌పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్‌పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. చూస్తుంటే ఐపీఎల్‌కు కూడా అసెంబ్లీ ఎన్నికల సెగ తాకినట్టు అనిపిస్తోంది.
నిరుడు డిసెంబర్ 16న అబూధాబీలో 19వ సీజన్ వేలం ముగిసింది. కానీ, ఇప్పటికీ షెడ్యూల్‌పై స్పష్టత లేదు. గత సీజన్ మాదిరిగానే మార్చిలోనే సీజన్ ఆరంభం అవుతుందని టాక్. మార్చి 26 నుంచి మే 31 వరకూ టోర్నీ నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే మెగా టోర్నీ ఆరంభానికి ఇంకో 45 రోజులు ఉన్నాయంతే.
𝐖𝐡𝐲 𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟔 𝐬𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐞 𝐢𝐬 𝐲𝐞𝐭 𝐭𝐨 𝐛𝐞 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝? 𝐁𝐂𝐂𝐈 𝐛𝐫𝐞𝐚𝐤𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞
The #BCCI hasn’t yet released the schedule for #IPL 2026, set to run from March 26 to May 31. The delay is attributed to potential clashes with upcoming Assembly… pic.twitter.com/7fRniWxWDx
— IndiaToday (@IndiaToday) February 12, 2026
అయితే.. త్వరలోనే బెంగాల్, తమిళనాడు, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో.. ఆయా రాష్ట్రాల్లో పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండే అవకాశముంది. అందుకే.. ఐపీఎల్ ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయమై ‘ఇన్సైడ్ స్పోర్ట్’ ప్రతినిధి ఒకరు బీసీసీఐ అధికారులను సంప్రదించగా.. అవునని చెప్పారు.
‘ఎన్నికల నేపథ్యంలోనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయడం లేదు. ఒకవేళ ఎన్నికల తేదీ, కౌంటింగ్ తేదీన మ్యాచ్‌లు ఉంటే వేదికను మార్చడం పెద్ద తలనొప్పి. ఎందుకంటే.. పోలీసులంతా ఎన్నిక విధుల్లో నిమగ్నమవుతారు. అప్పుడు స్టేడియాల వద్ద ఆటగాళ్లకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించలేరు. కాబట్టి.. అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వారి నుంచి ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చాక ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే.. రెండు విడతలుగా ఐపీఎల్ నిర్విహించడంపై ఆలోచిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. పద్దెనిమిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.
𝐑𝐂𝐁 𝐀𝐑𝐄 𝐈𝐏𝐋 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐀𝐓 𝐋𝐀𝐒𝐓 🏆✅#IPL2025 #RCBvPBKS pic.twitter.com/efcPJS98vy
— Sport360° (@Sport360) June 3, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

