Reflective Tapes | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రవాణా వాహనాలపై రిఫ్లెక్టివ్ టేపులు
Reflective Tapes | తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రాత్రి సమయంలో రవాణా వాహనాలు స్పష్టంగా కనబడేలా కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా వాహనాలపై QR ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ద్వారా ధృవీకరణ విధానాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ తెలియజేసింది.
Reflective Tapes | రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రాత్రి సమయంలో రవాణా వాహనాలు స్పష్టంగా కనబడేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటార్ వాహనాల నియమాలు, 1989 లోని రూల్ 104 నుండి 104(E) ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి అయిన వాహనాలపై QR ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ద్వారా ధృవీకరణ విధానాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ తెలియజేసింది.
ఈ విధానం 20-02-2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఎంపానెల్ చేసిన కంపెనీలు (OEMs) ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తులను పరిశీలించి క్రింది ఐదు Original తయారీదారులను (OEMs) ఎంప్యానెల్ చేయడం జరిగింది.
1. Orafol India Private Limited
2. 3M India Limited
3. Glodian Reflective Pvt. Ltd. (Reflomax)
4. Daoming Reflective Material India Pvt. Ltd.
5. Avery Dennison India Pvt. Ltd.
ఈ సంస్థలకు 08-02-2027 వరకు చెల్లుబాటు అయ్యే అధీకరణ పత్రాలు జారీ చేయబడినవి.
ఇతర ఏ సంస్థ/వ్యక్తి రిఫ్లెక్టివ్ టేపులు లేదా రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడానికి అనుమతి లేదు.
అమలు విధానం:
• ఎంపానెల్ చేసిన కంపెనీలు తమ అధీకృత డీలర్లు/అప్లికేటర్ల ద్వారా రవాణా వాహనాలకు టేపులు అమర్చాలి.
• అమర్చే టేపులపై తెలంగాణ రవాణాశాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్ కలిగిన QR కోడ్ ఉంటుంది.
• టేపులు అమర్చిన తర్వాత ‘అఫిక్సేషన్ సర్టిఫికేట్’జారీ చేయాలి.
• సర్టిఫికెట్లో వాహన వివరాలు, OEM వివరాలు, ఫోటోలు, కనీసం 2 సంవత్సరాల వారంటీ వివరాలు ఉండాలి.
ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం తప్పనిసరి ధృవీకరణ..
• రూల్ 104–104(E) ప్రకారం టేపులు తప్పనిసరి అయిన వాహనాలకు QR ఆధారిత ధృవీకరణ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయబడదు.
• సర్క్యులర్ జారీ అయిన తేదీ నుండి 3 నెలల వరకు పరిమిత మినహాయింపు ఉంటుంది (కొత్తగా అమర్చినవైతే).
• ఆ తరువాత QR ధృవీకరణ పూర్తిగా తప్పనిసరి.
ధరల నియంత్రణ :
ప్రభుత్వం ఆమోదించిన గరిష్ట ధరలు (MRP) కింది విధంగా ఉన్నాయి (అఫిక్సేషన్, సర్టిఫికేట్ ఛార్జీలు కలుపుకొని) :
• CT 20MM (మీటర్‌కు): రూ. 79.80 నుండి రూ. 85 వరకు
• CT 50MM (మీటర్‌కు): రూ. 145 నుండి రూ. 151.80 వరకు
• C3 (జతకు): రూ. 2500 నుండి రూ. 2650 వరకు
• C4 (జతకు): రూ. 2800 నుండి రూ. 2900 వరకు
• రిఫ్లెక్టర్లు 40MM: రూ. 35
• రిఫ్లెక్టర్లు 80MM: రూ. 60
ఈ ధరలకు మించి వసూలు చేస్తే ఎంప్యానెల్ రద్దు చేయడం, బ్యాంక్ గ్యారంటీ స్వాధీనం చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోబడతాయి.
పర్యవేక్షణ & చర్యలు :
• రవాణా శాఖ అధికారులు QR స్కానింగ్ ద్వారా ధృవీకరణ చేస్తారు.
• నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
• అన్ని జిల్లాలలో కనీసం ఒక అధీకృత డీలర్ ఉండాలి.
వాహన యజమానులకు విజ్ఞప్తి..
వాహన యజమానులు కేవలం ఎంపానెల్ చేసిన సంస్థల అధీకృత డీలర్ల వద్ద మాత్రమే రిఫ్లెక్టివ్ టేపులు అమర్చుకోవాలి. అధీకృత ధరల జాబితాను పరిశీలించాలి. ఈ చర్యలు రాత్రి సమయంలో రవాణా వాహనాలు మరింత స్పష్టంగా కనబడేలా ,రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని రవాణా శాఖ పేర్కొంది.
Read Also :
BRS | రాజేంద్ర నగర్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన
Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

