IND vs NAM : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన భారత జట్టు పసికూనపై పంజా విసిరేందుకు సిద్ధమైంది. రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడుతున్న టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బౌలింగ్ యూనిట్లోకి బుమ్రా వచ్చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్‌లో నమీబియాను ఢీ కొడుతోంది. తొలి పోరులో యూఎస్ఏపై టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. సో.. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ యూనిట్ దమ్ము చూపించేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు.
భారత తుది జట్టు : సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
నమీబియా తుది జట్టు : లౌరెన్ స్టీన్కాంప్, జాన్ ఫ్రైలింక్, జన్ నికోల్ లోఫ్టి ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జానే గ్రీన్(వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్మన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్జ్, బెన్ షికాంగో, మ్యాక్స్ హీంగో.