కళ్లను కాపాడుకుందాం
మనదేశంలో చాలామంది దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా డాక్టర్ను కలుస్తారు. కానీ, కళ్ల విషయానికి వచ్చేసరికి పట్టించుకోనట్టే వ్యవహరిస్తారు. తలనొప్పి వస్తున్నా, కళ్ల నుంచి నీరు కారుతున్నా.. నిద్రలేమి వల్లనో, ఫోన్ వాడటం వల్లేనేమో అనుకుంటారు.
మనదేశంలో చాలామంది దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా డాక్టర్ను కలుస్తారు. కానీ, కళ్ల విషయానికి వచ్చేసరికి పట్టించుకోనట్టే వ్యవహరిస్తారు. తలనొప్పి వస్తున్నా, కళ్ల నుంచి నీరు కారుతున్నా.. నిద్రలేమి వల్లనో, ఫోన్ వాడటం వల్లేనేమో అనుకుంటారు. సమస్య తీవ్రమయ్యేదాకా వైద్యుడి దగ్గరికి వెళ్లరు. కానీ, ఇలాంటి అజాగ్రత్త.. కంటిచూపుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్నవారు కంటి సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. అదుపు చేయలేని మధుమేహం వల్ల.. శరీరంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఆ ప్రభావం కంటిలోని అతిసూక్ష్మ నరాలపైనా పడుతుంది. దాంతో కంటిలోని రెటీనాకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా కంటిలో ఒత్తిడి పెరిగి.. గ్లకోమాకు దారితీస్తుంది. కొన్నిసార్లు ‘ఓపెన్ యాంగిల్ గ్లకోమా’ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ సమస్య వచ్చినట్లయితే.. ప్రారంభంలో లక్షణాలు పెద్దగా బయటపడవు. సమస్య ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. చూపు మసకబారడం, కంటిలో తీవ్రమైన నొప్పి, లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు లాంటి రంగులు కనిపించడం, వాంతులు, వికారం లాంటివి బాధిస్తాయి. పట్టించుకోకపోతే.. చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. కళ్లను కాపాడుకోవచ్చు. ఇందుకోసం రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకుంటే.. కళ్లలోని రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

