బెంగళూరు : కేంద్రంలోని బీజేపీపై నిరంతరం విమర్శలు చేసే నటుడు ప్రకాశ్‌రాజ్ తాజాగా మరోసారి కేంద్రం అస్తవ్యస్త విధానాలపై విరుచుకుపడ్డారు. తాను పుట్టిన, పెరిగిన, చదువుకున్న బెంగళూరు నియోజకవర్గం నుంచి తన ఓటు తొలగించడం జోక్‌గా ఆయన పేర్కొన్నారు. ఎవరి ఓటు హక్కునైతే తొలగించారో ఆ 65 లక్షల మంది ఓటర్లలో తాను కూడా చేరానని, ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాల సవరణ (సర్)లో తన పేరును కూడా తొలగించారని ఆయన ఇన్‌స్టాలో వెల్లడించారు.
‘జోక్ బాగుంది కదా.. ఇక ఆట మొదలు పెడదాం. ఓటును తిరిగి తెప్పించడానికి ఏమేం పత్రాలు చూపించాల్సి వస్తుందో’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ‘కానీ ఒక్క మాట మిత్రమా.. నిన్ను ఎన్నుకోని కొందరు పౌరుల ఓటు హక్కును అడ్డుకోవడానికి నువ్వు నీ అధికారాలను ఉపయోగించవచ్చు. కానీ మమ్మల్ని ఆపగలవా? నా ప్రియ మిత్రమా.. మా శక్తితో నిన్ను పదవి నుంచి దింపుతాం.. ఊరికే అడుగుతున్నా అంతే.. సెలవు..’ అని ఆయన ముగించారు.