గురువారం 01 అక్టోబర్ 2020
Rangareddy - Aug 05, 2020 , 00:24:35

సకల సౌకర్యాలతో థీమ్‌ పార్కులు

సకల సౌకర్యాలతో థీమ్‌ పార్కులు

పలు డివిజన్లలో అభివృద్ధి పనులను

 ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

హయత్‌నగర్‌ : హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధి సుగుణ ఎన్‌క్లేవ్‌(అనుమగల్‌)లో థీమ్‌ పార్కు అభివృద్ధి పనులకు కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీఎల్‌ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. థీమ్‌ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణం, గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్‌ తదితర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. థీమ్‌ పార్కుల సమీపంలోని పాఠశాలల విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పార్కు చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండేలా ప్రత్యేక కందకం ఏర్పాటు చేస్తామన్నారు. థీమ్‌ పార్కులు కాలనీలకు పచ్చ తోరణంలా ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఉంటాయన్నారు. అనతరం రేడియో స్టేషన్‌ వద్ద గుడిసెవాసులు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌ఈ శంకర్‌లాల్‌, హయత్‌నగర్‌ సర్కిల్‌ ఈఈ రాజయ్య, డిప్యూటీ ఈఈ భద్రు నాయక్‌, ఏఈ విజయేందర్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు గుడాల మల్లేశ్‌, వార్డు సభ్యులు కాటెపాక స్కైలాబ్‌, గడ్డం బాలు, అమరావతి, ఏరియా కమిటీ సభ్యులు మిట్టకంటి సత్తిరెడ్డి, బాలకృష్ణ, నాయకులు రాజు నాయక్‌, గంగని నగేశ్‌, పంతు నాయక్‌, గోవర్ధన్‌, శేఖర్‌ నాయక్‌ దేవరాం నాయక్‌, హరికృష్ణ, శివకృష్ణ, ప్రకాశ్‌, ప్రవీణ్‌, చరణ్‌, సురేశ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ నక్క దర్శన్‌, ఎర్ర యాదయ్య, జెల్ల సత్యనారాయణ పాల్గొన్నారు. 

పార్కులతో ఆరోగ్యం, ఆనందం.. 

వనస్థలిపురం : పార్కులు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హస్తినాపురం డివిజన్‌ ఇంద్రప్రస్థ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ టీచర్స్‌ కాలనీలో థీమ్‌ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో థీమ్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్కులను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న, హస్తినాపురం కార్పొరేటర్‌ పద్మాశ్రీనివాస్‌ నాయక్‌, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మొద్దు లచ్చిరెడ్డి, డీసీ మారుతి దివాకర్‌, ఎస్‌ఈ శంకర్‌లాల్‌, ఈఈ రాజయ్య, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కటికరెడ్డి అర్వింద్‌రెడ్డి, టీచర్స్‌ కాలనీ అధ్యక్షుడు తూం భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు యాదగిరిరెడ్డి, మాధవరం నర్సింహారావు, సామ బుచ్చిరెడ్డి, గంగం శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.logo