శుక్రవారం 27 నవంబర్ 2020
Nri-news - Oct 28, 2020 , 10:38:23

న్యూజిలాండ్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

న్యూజిలాండ్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

హైద‌రాబాద్ : న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ సంబురాలు చేసుకున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు స్థానిక ఎంపీ ప్రియాంక రాధాకృష్ణ‌న్‌, ఇండియ‌న్ హై క‌మిష‌న్ హానోరారి కాన్స‌ల్ శ్రీ భావ్ దిల్లోన్‌, ఇండియ‌న్ న్యూస్ లింక్ ఎడిట‌ర్ వెంక‌ట్రామ‌న్‌, పోలీసు విభాగం నుంచి జెస్సికా ఫూఅంగ్‌తో పాటు వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.  

ఈ వేడుక‌ల్లో తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పంపిన బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బ‌తుక‌మ్మ‌ల‌ను అందంగా తీర్చిదిద్ది.. ఆడిపాడారు. గౌరీ పూజ చేశారు. వివిధ అంశాల మీద పోటీలు నిర్వ‌హించి.. బ‌హుమ‌తుల‌ను ప్ర‌దానం చేశారు. బ‌తుక‌మ్మ‌లు తెచ్చిన ఆడ‌బిడ్డ‌ల‌ను చీరెల‌తో స‌త్క‌రించారు. తెలంగాణ వంట‌కాల‌తో విందును ఏర్పాటు చేశారు.   


తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ అధ్య‌క్షురాలు జ్యోతి ముద్దం మాట్లాడుతూ.. బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను విశ్వ‌వ్యాప్తం చేసి క‌విత‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. న్యూజిలాండ్ శాఖ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ఆమె వివ‌రించారు. 

తెలంగాణ జాగృతి న్యూజిలాండ్‌ ప్రధాన కార్యదర్శి ప్రసన్న గుముడవెల్లి, సరిత కొంక, సంధ్య గౌడ్, విక్రమ్ కటుకంరు, సుకృతి పడాల, హరి ప్రసాద్ బలిదే, నిహారిక నోరి, లావణ్య కోమల్, అంజలి పోసిరెడ్డితో పాటు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.