KTR | తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ.. ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ.. బీఆర్ఎస్: కేటీఆర్
బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీనేని రణమని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీనేని రణమని చెప్పారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ అని చెప్పారు. గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్లిలో పుట్టిన ఇంటి పార్టీ, ఈ నేల మేలుకోరే పార్టీ బీఆర్ఎస్. పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్న మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘రెపరెపలాడే గులాబీ పతాకం, తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా. పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా. పుట్టుకే ఒక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం. ఆత్మగౌరవ మెరుపులు, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ అస్తిత్వ చైతన్యం. జలదృశ్యంలో ఉదయించి, ఉర్రూతలూగించే ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించి, స్వరాష్ట్రం సాధించి.. సస్యశ్యామల సన్నివేశాలను సృష్టించి గమ్యాలను ముద్దాడిన గమనం.
అమేయం..అజేయం..అనితర సాధ్యం గులాబీ పరివర్తన ప్రస్థానం. ముళ్లూ రాళ్లూ అవాంతరాలను అధిగమిస్తూ పరవళ్లు తొక్కిన పయనం. చావునోట్లో తలబెట్టి సాహసంగా పోరాడిన దళపతి.. లాఠీలకు, జైళ్లకు వెరవక కొట్లాడిన గులాబీ సైనికుల త్యాగ నిరతి. ఆటుపోట్లను చూసి అదిరిపడలేదు, ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదు, గెలిస్తే పొంగిపోలేదు, ఓటములకు కుంగిపోలేదు. జయాపజయాలకు అతీతమైన స్థిత ప్రజ్ఞత. ఆకులురాలే శిశిరంలో, ఆకుపచ్చని వసంతంలోనూ ఒకటే నిబద్ధత.
వేయి దాడులు.. లక్ష కుట్రలు, విష ప్రచారాలు, విచ్ఛిన్న పన్నాగాలను ఎదిరించి నిలిచిన సత్తా. దండి గుండె దళపతి నెత్తురు మండి ఎత్తిన జెండా. ఏ పాత్రలో వున్నా జనమే ఎజెండా. మొన్నటి పోరాటం ప్రపంచానికే పాఠం, నిన్నటి పాలన దేశానికే నయా నమూనా. నేడు.. ప్రజాపక్షంవహించే సమర్థ ప్రతిపక్షం.
తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ, ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ. ఇది పేగు తెంచుకున్న ప్రేమ బంధం. సమరంలో, సంబురంలో కష్ట సుఖాలను కలబోసుకున్న అనుబంధం. తెంచలేని తుంచలేని జన్మజన్మాల సంబంధం. మనమే తెలంగాణ దళం, మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు, మీ శ్రమకు, మీ కృషికి సదా సలాం.. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం. భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
రెపరెపలాడే గులాబీ పతాకం
తెలంగాణ ఎగరేసిన జయ కేతనం..!పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా ..!
పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా..!పుట్టుకే ఒక సంచలనం..
దారి పొడవునా రాజీలేని రణం..!ఆత్మగౌరవ మెరుపులు..అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న ..స్వీయ రాజకీయ అస్తిత్వ చైతన్యం..!… pic.twitter.com/jXAtTGuiBE
— KTR (@KTRBRS) April 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Formation day
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

