శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 23, 2020 , 03:43:24

బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం!

 బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం!
  • - ఎవరి లెక్కల్లో వారు
  • - సర్వే ఫలితాలు అనుకూలంగా రావడంతో టీఆర్ నూతనోత్తేజం
  • - 25న కౌంటింగ్, ఫలితాల వెల్లడి
  • - 27న మేయర్, చైర్మన్ల ఎన్నికనిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పోలిం గ్ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న రా జకీయ నాయకులు.. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలపై ఆరాతీస్తున్నారు. ఎన్నికలు ముగియడం తో బ్యాలెట్ పత్రాలను బాక్సుల్లో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ తరలించారు. ఈనెల 25న కౌంటింగ్ ఉం టుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఎవరికివారే గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటూ కౌం టింగ్ రోజు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉంది. సర్వే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఎంఐఎం కోటలో కూడా ఈసారి టీఆర్ పాగా వేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఎవరి మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ సాధించి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాలో టీఆర్ శ్రేణులు ఉన్నాయి.

నిజామాబాద్ కార్పొరేషన్ పాటు బోధన్, ఆర్మూర్, భీమ్ మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను టీఆర్ కైవసం చేసుకోవడం ఇక లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27న మేయ ర్, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. దీంతో ఫలితా లు వచ్చిన మరుసటి రోజే చైర్మన్ల ఎన్నిక ఉండడంతో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది. చైర్మన్ల ఎన్నికకు ఎక్కువ సమయం తీసుకోకపోవడంతో క్యాంప్ రాజకీయాలకు అవకాశం లేకుండా పోయింది. చేతులెత్తే విధానం ద్వారా మేయర్, చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఈనెల 25న కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బోధన్, ఆర్మూర్, భీమ్ కౌంటింగ్ కేంద్రాలను కూడా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సమయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఈవీఎంల ద్వారా లెక్కింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యే వీలుండేది. ప్రస్తుతం బ్యాలెట్ ప్రతాలన్నీ ఒక దగ్గర పొగేసి వాటిని లెక్కించనున్నారు. దీంతో ఏ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళి ఎలా ఉందో తేల్చుకోవడం కష్టమే. మొత్తంగా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈవీఎంల ద్వారా మధ్యాహ్నం నాటికి రౌండ్ల వారీగా కౌంటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే ఫలితాలను ప్రకటించేవారు. ఇప్పుడు ఫలితాల ప్రకటనకు సమయం పట్టే అవకాశం ఉన్నది. ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో మరింత సమయం తీసుకోనున్నారు.


logo