బెంగళూరు: బెంగళూరు నగర రోడ్ల దుస్థితిపై విసుగెత్తిన ప్రజలు తమ కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లభించడం లేదు. దీంతో నగరంలోని భారతీనగర్ పౌరులు తమ నిరసన తెలియచేసేందుకు వినూత్న పంథాను ఎంచుకున్నారు.
తంబుచెట్టి జంక్షన్ వద్ద రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత వద్ద హోమం నిర్వహించి ప్రభుత్వం తమ మొర ఆలకించాలని ప్రార్థించారు. నగర కార్పొరేషన్‌కు కనువిప్పు కలగాలని గుంత ముందు స్థానికులు చేసిన ప్రార్థనలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.