Blood Cancer Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లే..
మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేయడంతో పాటు కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. క్యాన్సర్ లో కూడా వివిధ రకాలు ఉంటాయి. వాటిలో బ్లడ్ క్యాన్సర్ ఒకటి. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎముక మజ్జలో ప్రారంభమై రక్తకణాలను ప్రభావితం చేస్తుంది.
Blood Cancer Symptoms | మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేయడంతో పాటు కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. క్యాన్సర్ లో కూడా వివిధ రకాలు ఉంటాయి. వాటిలో బ్లడ్ క్యాన్సర్ ఒకటి. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎముక మజ్జలో ప్రారంభమై రక్తకణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని లుకేమియా అని కూడా అంటారు. ఇది మాత్రమే కాకుండా లింఫోమా, మైలోమా వంటి వివిధ రకాల రక్త క్యాన్సర్లు కూడా ఉన్నాయి. ఇక బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం కూడా చాలా అవసరం. ఈ లక్షణాల గురించి చాలా మందికి ఎటువంటి అవగాహన ఉండదు. కనుక బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్వరం, చెమటలు..
బ్లడ్ క్యాన్సర్ ప్రారంభదశలో ఉన్నప్పుడు మెడ లేదా చంక భాగాల్లో నొప్పి లేని రబ్బరు లాంటి గడ్డలు ఏర్పడతాయి. ఇవి కొన్ని వారాల పాటు అలాగే ఉంటే తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. ఇది లింఫోమా ప్రారంభ సంకేతాలలో ఒకటి. అలాగే విపరీతమైన జ్వరం, రాత్రి సమయంలో చెమటలు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదకరమైన సంకేతాల్లో ఒకటి. లుకేమియా క్యాన్సర్ లో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వారం లేదా నెలలోనే ఊహించనంతగా బరువు తగ్గుతారు. క్యాన్సర్ కణాలు జీవక్రియను ప్రభావితం చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. బ్లడ్ క్యాన్సర్ రక్తనిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో శరీరంలో రక్తహీనత తలెత్తుతుంది. రక్తహీనత కారణంగా వ్యాయామం చేసేటప్పుడు అలసట, శరీరం పాలిపోయినట్టుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దంతాలు, చిగుళ్ల సమస్యలు..
ఇక బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన వారిలో చిగుళ్ల నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాల నుండి ఎక్కువ రక్తస్రావం కావడం, సులభంగా గాయాలు కావడం వంటివి జరుగుతాయి. అదే విధంగా లింఫోమా క్యాన్సర్ లో ఎముక నొప్పి, పగుళ్లు, దీర్ఘకాలిక వెన్నునొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ లల్లో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల లింఫోమాలు కాలేయాన్ని పెద్దదిగా చేస్తాయి. దీనితో పాటు అజీర్ణం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గాబరా పడకుండా వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. టీబీ, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, ఐరన్ లోపం వంటి సమస్యల్లో కూడా ఇటువంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే క్యాన్సర్ అని భావించకుండా, భయపడకుండా తనిఖీ చేసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

