10 కోట్ల విలువైన ఆస్కార్బిక్ యాసిడ్ స్వాధీనం

Sat,August 12, 2017 07:37 PM

DRI seized 122 MT of Ascorbic Acid at borders of NE state

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ర్టాల సరిహద్దుల్లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చైనా నుంచి ఈశాన్య రాష్ర్టాల సరిహద్దుల గుండా మయన్మార్ తరలిస్తున్న 122.5 మిలియన్ టన్నుల ఆస్కార్బిక్ యాసిడ్(విటమిన్-సీ)ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్కార్బిక్ యాసిడ్‌ను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్కార్బిక్ యాసిడ్‌ను సీజ్ చేశారు అధికారులు.

675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS