శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 20:16:22

కూల్‌డ్రింక్‌ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది

కూల్‌డ్రింక్‌ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని రేగొండ మండలం గూడెపల్లిలో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగి ముగ్గురు బాలురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముద్దమల్ల రాజనర్సు కొన్నిరోజులుగా మతిస్థిమితం కోల్పోయి పలు మార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగా  ఆదివారం కూల్‌డ్రింక్‌ తెచ్చుకుని, అందులో పురు గుల మందు కలుపుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇంటిముందు రాజనర్సు కొడుకు ముద్దమల్ల దిలీప్‌(11), ఇంటిపక్కన గల గూడూరు బాపయ్య ఇద్దరు కొడుకులు గూడూరు రాంచరణ్‌(12), శివగణేష్‌ (10) కలిసి ఆడుకుం టున్నారు.

అనంతరం వారు ముగ్గురు రాజనర్సు ఇంట్లోకి వెళ్లగా కూల్‌డ్రింక్‌ కనపడింది. తన తండ్రి తన కోసమే కూల్‌డ్రిండ్‌ తెచ్చాడనే సంతోషంతో దిలీప్‌, తన ఇద్దరు స్నేహితులతో కలిసి దాన్ని తాగారు. దీంతో సుమారు 30 నిమిషాల తర్వాత అపస్మారక స్థితిలో వెళ్లి పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు 108కి సమాచారం అందించడంతో చికిత్స కోసం పరకాలలో ఓ ప్రైవేట్‌ దవాఖాన తరలించారు.అక్కడి వైద్యులు పరీక్షించి పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగినట్లు నిర్ధారించారు. ముగ్గురిలో శివగణేశ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు.

ఇవి కూడా చదవండి..


పద్య ప్రక్రియను ‌ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన

క‌రోనా దెబ్బ‌.. మరో 12 కోట్ల మంది పేద‌రికంలోకి.. 

రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం 

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి VIDEOS

logo