గురువారం 28 మే 2020
Cinema - May 01, 2020 , 13:48:00

ల‌క్షా 75వేల రూపాయ‌ల‌ని విరాళంగా అందించిన క‌మెడీయ‌న్

ల‌క్షా 75వేల రూపాయ‌ల‌ని విరాళంగా అందించిన క‌మెడీయ‌న్

క‌రోనా సంక్షోభంలో త‌న‌వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు గిరిబాబు త‌న‌య‌డు ర‌ఘుబాబు. త‌న‌దైన శైలిలో కామెడీని పండించే ర‌ఘుబాబు ఈ క‌ష్ట స‌మ‌యంలో త‌న అభిమానుల‌ని, సినీ కార్మికుల‌ని కాపాడుకోవ‌ల‌సిన బాధ్య‌త త‌న‌పైన ఉంద‌ని భావించి లక్షా 75 వేల రూపాయలను విరాళంగా అందించారు.

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన సి సి సి కి. రఘుబాబు లక్ష రూపాయల విరాళం ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేలు, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేలు, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేలు, మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది.  


logo