మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 23, 2020 , 03:58:44

పోటెత్తిన ఓటర్లు

పోటెత్తిన ఓటర్లు


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వనపర్తి, పెబ్బే రు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలో మొ త్తం 80 వార్డులుంటే, జిల్లా కేంద్రంలోని 5 వార్డు ఏకగ్రీవం కాగా, మిగతా 79 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పార్టీల తరఫున 342 మ ంది అభ్యర్థులు కౌన్సిల్ బరిలో ఉన్నారు. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 1,01,468 మంది ఓటర్లుండగా, 77,234 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళ ఓటర్లు 38,818 మంది ఓటు వేయగా 76.10 శాతం, 38,416 మంది పురుషులు తమ ఓటును వినియోగించుకొని 76.15 శాతంగా నమోదైంది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కలెక్టర్ శ్వేతా మొహంతి, జేసీ వేణుగోపాల్ జిల్లా కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో 76 శాతం నమోదు..

జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో వారీ గా మొత్తం 76.12 శాతం ఓటింగ్ నమోదైంది. వనపర్తిలో అత్యల్పంగా 72.96 శాతం పోలింగ్ నమోదు కాగా, పెబ్బేరులో 82.51 శాతం అత్యధికంగా నమోదైంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో మధ్యస్తంగా పోలింగ్ కొనసాగింది. అమరచింతలో 80.69 శాతం, ఆత్మకూరులో 77.89 శాతం, కొత్తకోటలో 77.96 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి 12 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో రద్దీ కనిపించింది. అనంతరం కొంత మందకోడిగా సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యాహ్నం నుంచి కాలనీల్లోని ఓటర్లను అభ్యర్థులు పిలుచుకు రావడం, వృద్ధులను ఆటోల్లో తరలించడంలాంటివి చేపట్టారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్ల ద్వారా రాని ఓటర్లను తెలుసుకొని ఫోన్ల ద్వారా అభ్యర్థులు పురమాయించారు.

స్ట్రాంగ్ బ్యాలెట్ బాక్సులు..

పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులకు సీల్ చేసి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. గతంలో ఒకేచోటకు చేర్చి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేవారు. ఈ దఫా మార్పు  చేశారు. ఐదు మున్సిపాలిటీల వారీగా ప్రత్యేకంగా కేటాయించిన భవనాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. వనపర్తిలోని పాలిటెక్నిక్ భవనం, పెబ్బేరులో మార్కెట్ గోడౌన్, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమరచింతలో జెడ్పీ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఆయా కేంద్రాల్లో ఈనెల 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

అధికారుల పర్యవేక్షణ..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వారావు పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. వీరితో పాటు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని 160 పోలింగ్ కేంద్రాలను వెబ్ ద్వారా కలెక్టర్ జిల్లా కార్యాలయంలోను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.logo
>>>>>>