ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 22, 2021 , 00:15:57

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

  • ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 
  • టీఆర్‌ఎస్‌లో జోరుగా చేరికలు

పెద్దేముల్‌, జనవరి 21 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం కందనెల్లి తండా సర్పంచ్‌ జె.శాంతిబాయి, ఉపసర్పంచ్‌ మానిబాయి, వార్డు సభ్యులు ఆర్‌.శాంతిబాయి, జె.సాగర్‌, కోఆప్షన్‌ సభ్యుడు వి.గోబ్య్రానాయక్‌, జె.గోబ్య్రానాయక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌, కందనెల్లి తండా సర్పంచ్‌ జె.శాంతిబాయి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు టి.రమేశ్‌, నరేశ్‌రెడ్డి, పార్టీలో చేరిన నాయకులు జె.రాందాస్‌, ఆర్‌.రవీందర్‌, జె.రంగారావు, జె.చందర్‌, జె.శ్రీను, ఆర్‌.ముఖేశ్‌ పాల్గొన్నారు. 

గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తా 

తాండూరు రూరల్‌, జనవరి 21: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో పాలవర్గం ఏర్పాటైన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వైకుంఠధామాలు, పల్లెపకృతి వనాలు, 7 రైతువేదికల నిర్మాణాలు చేపట్టామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు సహకారం అందిస్తానన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, సీనియర్‌ నాయకురాలు శకుంతల, రైతు బంధు సమితి కన్వీనర్‌ రామలింగారెడ్డి, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు ఉన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే 

తాండూరు, జనవరి 21: ఆలయాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు కాళికామాత ఆలయం ఈవో, పూజారి ఎమ్మెల్యేను కలిసి 29వ తేదీన నిర్వహించే నూతన మండప నిర్మాణ  శంకుస్థాపనకు ఆహ్వానించి సన్మానించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహకరిస్తానని చెప్పినట్లు తెలిపారు. 


VIDEOS

logo