ఈ నెల 21న హాన‌ర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Sat,May 4, 2019 02:51 PM

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 20 ప్రొను ఈ నెల 21వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ముందుభాగంలో డిస్‌ప్లే లోప‌ల ఒక కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. దీన్నే పంచ్‌-హోల్ కెమెరాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే ఈ ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను, ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. దీంతోపాటు ఈ ఫోన్‌లో కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. కాగా ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి ఫీచ‌ర్ల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

1883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles