FIFA-Saudi Aramco | ఫిఫా స్పాన్సరర్‌గా సౌదీ ఆరామ్కో.. ఎప్పటినుంచంటే..?!
FIFA-Saudi Aramco | ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ (ఫిఫా)తో సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ సౌదీ ఆరామ్కో జత కట్టనున్నది.
FIFA-Saudi Aramco | ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ (ఫిఫా)తో సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ సౌదీ ఆరామ్కో జత కట్టనున్నది. 2037 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను సౌదీ అరేబియా గతేడాది అక్టోబర్‌లో గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో ఫిఫా’ స్పాన్సరర్‌గా సౌదీ అరామ్కో ఎంపికవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే 2026 ఫిఫా పురుషుల ప్రపంచకప్, 2027 మహిళా వరల్డ్ కప్ టోర్నమెంట్ల నుంచి ఫిఫాకు సౌదీ ఆరామ్ కో స్పాన్సరర్‌గా ఉండనున్నది. టోర్నమెంట్ ఆతిథ్యం ఎవరు ఇస్తారన్న విషయం వచ్చేనెలలో ఖరారు చేస్తారు. ఫిఫా-సౌదీ ఆరామ్ కో మధ్య స్పాన్సర్ షిప్ ఒప్పందం ఎంత అన్నది వెల్లడి కాకున్నా.. భారీ మొత్తం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో వచ్చే ఏడాది అమెరికా నిర్వహించే 32-టీమ్స్ వరల్డ్ కప్ కూడా జత కలుస్తుంది.
రష్యా ఆతిథ్యం ఇచ్చిన 2018-వరల్డ్ కప్ కంటే ముందు నుంచే సౌదీ అరేబియాతో జత కట్టేందుకు ఆ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటినో సత్సంబంధాలు నెలకొల్పారు. 2034 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల కోసం గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో సౌదీ అరేబియా ఒక్కటే నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

