ICICI Credit Cards | ఐసీఐసీఐ బ్యాంకుకు షాక్.. 17వేల క్రెడిట్ కార్డులు బ్లాక్.. ఏమైందంటే..?!
ICICI Credit Cards | క్రెడిట్ కార్డుల వివరాలు బహిర్గతం కావడంతో 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.
ICICI Credit Cards | ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘ఐసీఐసీఐ బ్యాంక్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టెక్నాలజీ లోపం వల్ల సుమారు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితం అయ్యాయని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం అంగీకరించింది. సదరు కార్డులు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద ఇతరుల ఖాతాలతో పొరపాటున లింక్ అయినట్లు తెలిపింది. అయితే, వెంటనే తమ పొరపాటును సరిదిద్దామని, ఈ కార్డులకు సంబంధించిన డేటా దుర్వినియోగమైనట్లు తమకు సమాచారం అందలేదని వెల్లడించింది. ఈ పొరపాటు వల్ల తమ ఖాతాదారులెవరైనా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇలా లింక్ అయిన క్రెడిట్ కార్డులను బ్లాక్ చేశామని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. బ్యాంకుల్లో ఖాతాదారుల డేటా భద్రతపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ.. కొటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు ఇతరులకు లింక్ కావడం ఆసక్తికర పరిణామం.
ఇప్పటికే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు గల కస్టమర్ల ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డులు పొరపాటున లింక్ అయ్యాయని ఐసీఐసీఐ బ్యాంక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఇతరుల కోసం రూపొందించిన క్రెడిట్ కార్డులను ఇప్పటికే క్రెడిట్ కార్డుల ఖాతాదారులు చూశారు. మరి కొందరు ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లో లాగిన్ కాగానే తాము దరఖాస్తు చేయకున్నా కొత్త క్రెడిట్ కార్డుల వివరాలు కనిపించాయని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సమస్య వెలుగు చూడగా, గురువారం బ్యాంకు యాజమాన్యం ధృవీకరించింది. తాజాగా బహిర్గతమైన క్రెడిట్ కార్డుల్లో సదరు క్రెడిట్ కార్డు పూర్తి సంఖ్య, సీవీవీ తదితర వివరాలు ఉన్నాయి. సైబర్ మోసగాళ్లు వీటిని దుర్వినియోగం చేసి మోసపూరిత లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. కానీ ఓటీపీ లేకుండా లావాదేవీలు నిర్వహించడం కుదరదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

