గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 00:00:22

ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దాం

 ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దాం
  • టీవోఏ అధ్యక్షుడు జయేశ్‌ రంజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల సలహా లు, సూచనలు తీసుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్దామని తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌(టీవోఏ) అధ్యక్షులు జయేశ్‌ రంజన్‌ అన్నారు. తాజాగా జరిగిన టీవోఏ ఎన్నికల్లో  ఘనవిజయం సాధించిన రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ను కొత్త కార్యవర్గం మంగళవారం సన్మానించింది. టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి, టీవోఏ ఉపాధ్యక్షులు వేణుగోపాల చారి నేతృత్వంలో సభ్యులు మర్యాదపూర్వకంగా అధ్యక్షున్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జయేశ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతివచ్చాక బాధ్యత లు స్వీకరిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో ని మారుమూల పల్లెలో ఉంటున్న మెరుగైన ప్రతిభ కల్గిన ఆటగాళ్లను గుర్తించేందుకు అం దరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. 


క్రీడలకు కావాల్సిన పరికరాలు, కోచ్‌ లు, అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఓ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కార్పొరేట్‌ కంపెనీల సహకారంతో ఒడిశా రాష్ట్రం తరహాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి తోడు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటి(సీఎస్‌ఆర్‌) కింద క్రీడలను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్లు రంజన్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌, ఉపాధ్యక్షులు వేణుగోపాల చారి, ప్రేమ్‌రాజ్‌, సంయుక్త కార్యదర్శులు మల్లారెడ్డి, సోమేశ్వర్‌, కోశాధికారి మహేశ్వర్‌, ఈసీ మెంబర్లు కోట్ల రామకృష్ణ, అబ్బాస్‌, ఖాజాఖాన్‌, జనార్దన్‌ రెడ్డి, పురుషోత్తం, దీపక్‌ కుమార్‌, రాంకోటేశ్వర్‌, మహేందర్‌ రెడ్డి, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>