న్యూఢిల్లీ: బిపర్జాయ్ తీవ్ర తుఫాన్(Biparjoy Cyclone)గా మారింది. మరో 24 గంటల్లో మరింత ఉదృత రూపం దాల్చనున్నది. ఈశాన్యం దిశగా తుఫాన్ కదులుతున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. బిపర్జాయ్ వల్ల గుజరాత్ వల్సాద్‌లో ఉన్న తీతల్ బీచ్‌లో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ బీచ్‌ను జూన్ 14వ తేదీ వరకు మూసివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాత్కాలిక షెల్టర్లను రెఢీ చేశారు.
#WATCH | Gujarat: High waves are seen at Tithal beach of Valsad ahead of Cyclone Biparjoy.
Tithal Beach was closed for tourists as a precautionary measure by the Valsad administration following the cyclone Biparjoy warning (9/06) pic.twitter.com/TSvQfaiezv
— ANI (@ANI) June 10, 2023