Singapore | సింగపూర్‌లో ఘనంగా మేడే వేడుకలు.. కార్మికులకు క్రికెట్ టోర్నమెంట్!
Singapore | కార్మిక శక్తిని ఉత్తేజపరచడానికి సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మూడు వారాల పాటు స్థానిక క్రాంజి రిక్రియేషన్ సెంటర్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు.
Singapore | కార్మిక శక్తిని ఉత్తేజపరచడానికి సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మూడు వారాల పాటు స్థానిక క్రాంజి రిక్రియేషన్ సెంటర్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ పోటీల్లో 11 జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పుల్లన్న గారి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చిన తెలుగు స్టార్స్ టీమ్ వీరా ఫ్లేవర్స్ టీమ్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసిన వీరా ఫ్లేవర్స్ పరిమిత 10 ఓవర్లలో నాలుగు వికెట్స్ తీసుకుని 84 పరుగులు ఇచ్చారు. ఆ తరువాత ఇన్నింగ్స్‌లో తెలుగు స్టార్స్ బౌలింగ్‌లో ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల నష్టానికి 63 పరుగులు దగ్గర కట్టడి చేసి అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రాపేటి జనార్థన్ మాట్లాడుతూ.. సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్యాట్స్ మాన్ (ఖాసిమ్), బౌలర్ (కామేశ్వరరావు), ఆల్‌రౌండర్ (సుబ్బారెడ్డి) లకు అవార్డులు ప్రదానం చేశారని తెలిపారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్లేయర్స్ కు చక్కటి సందేశం ఇస్తూ, కార్మిక సోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మేరువ కాశిరెడ్డి పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమానికి వివిధ టీమ్‌ల మద్దతు దారులుగా వ్యవరించిన వారు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో పాటు, మరికొందరు దాతలు సహకారం అందించారు.
ఈ టోర్నమెంట్‌కు సింగపూర్‌లోని తందూరి లాంజ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. మెగా గ్రోసరీ మార్ట్ కో స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ రెండు కంపెనీలు పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్లకు టీషర్ట్ లతో పాటు గెలిచిన వారికి కప్పులు అందించారు. ఫైనల్లో గెలిచిన వారికి జ్యోతిశ్వర్, బీవీవీ శ్రీనివాస్, యశ్వంత్ లు 1000 డాలర్లు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి కేపీ వర్మ, గోపాల్ 500 డాలర్ల నగదు ప్రదానం చేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, శ్రీనివాస రెడ్డి, మల్లిక్, నాగేశ్వర్, కోశాధికారి ప్రసాద్, కమిటీ సభ్యులు సమ్మయ్య, సుప్రియ, రామిరెడ్డి, రమణ, జితేందర్, గోపికిశోర్ ఇతర సభ్యులు పెద్ద ఎత్తున్న పాల్గొని జయప్రదం చేశారు. చివరగా యూనిలివర్ వారి సౌజన్యంతో ఫైనల్ పోటీలో పాల్గొన్న ఆటగాళ్లు అందరికీ ఒక కేజీ బూస్ట్ బాటిల్ కూడా ఇచ్చారు . ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లోని తెలుగు కార్మిక సోదరులకి ఈ మూడు వారాల మేడే క్రికెట్ పోటీలు ఒక పండగ కార్యక్రమంలా అందరి మన్ననలు పొందింది.
ఈ టోర్నమెంట్లో భాగమైన 11 టీమ్‌లు.. వారి మద్దతుదారుల వివరాలు..
☞ చిత్తూరు సూపర్ కింగ్స్ (జ్యోతీశ్వర్ రెడ్డి),
☞ తెలుగు వారియర్స్ (రామిరెడ్డి & రామచంద్ర రెడ్డి),
☞ కోడిమియల్ వెల్ విషర్స్ (పెద్ది శేఖర్ రెడ్డి & ఫ్రెండ్స్),
☞ టాప్ పేవ్ క్రికెట్ టీమ్ (శ్రీకాంత్ రెడ్డి),
☞ సెంబవాంగ్ స్ట్రైకర్స్, తెలుగు స్టార్స్ (శ్రీనివాస్ రెడ్డి),
☞ గొల్లపల్లి కింగ్స్ (టేకూరి నగేష్),
☞ వీరా ఫ్లేవర్స్ (కాకర్ల మహేష్ ),
☞ తెలుగు రత్నాలు (వాక్ ఆఫ్ లైఫ్ గ్రూప్),
☞ రోటరీ కింగ్స్ (నిషాంత్ రెడ్డి),
☞ తెలుగు డ్రాగన్స్ (స్మాషర్స్ బాడ్మింటన్ గ్రూప్)
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video





