Rave Party | బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో రేవ్‌పార్టీ (Rave Party) జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో రేవ్‌పార్టీ (Rave Party) జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు (Telugu Stars), మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు.
ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకొని దాడి చేశారు. ఏపీ, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు గుర్తించి సీజ్ చేశారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ సమీపంలో బెంజ్, జాగ్వార్, ఆడీ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. రేవ్ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న బెంజ్ కారు సైతం లభ్యమైనట్లు సమాచారం. పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Lok Sabha Elections | తొలిసారి ఓటేసిన 56 ఏళ్ల అక్షయ్ కుమార్.. కొనసాగుతున్న పోలింగ్
Iran President: దేశాధ్యక్షుడు మరణిస్తే.. కొత్త అధ్యక్షుడెవరు?.. ఇరాన్ రాజ్యాంగం ఏం చెబుతోంది?
Cyber Crime | కమీషన్‌కు కక్కుర్తిపడి బ్యాంకు ఖాతాలు.. దుబాయ్‌లో ఉండే ఇండియన్స్‌కు సైబర్‌నేరగాళ్ల ఎర
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

