Lok Sabha Elections | తొలిసారి ఓటేసిన 56 ఏళ్ల అక్షయ్ కుమార్.. కొనసాగుతున్న పోలింగ్
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టార్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), రాజ్కుమార్ రావ్, ఐరా ఖాన్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, షాహిద్ కపూర్ సహా పలువురు తారలు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్, గతేడాది ఆగస్టు 2023లో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఇక ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది.
Akshay Kumar casts early vote in Mumbai as fifth phase of Lok Sabha elections 2024 kicks off
Read @ANI Story | https://t.co/MfIfFsxUn0#AkshayKumar #LokSabhaElections #Mumbai pic.twitter.com/bisRLzbaDM
— ANI Digital (@ani_digital) May 20, 2024
#AkshayKumar has a message for voters and is confident of a good turnout pic.twitter.com/8jlT4B4dOo
— BollyHungama (@Bollyhungama) May 20, 2024
#WATCH | Bollywood Actress Janhvi Kapoor casts her vote at a polling station in Mumbai for #LokSabhaElections2024
“Please come out and vote, ” she says pic.twitter.com/5Ki6JH30Et
— ANI (@ANI) May 20, 2024
Also Read..
Smriti Irani | అమేథిలో ఓటేసిన స్మృతి ఇరానీ
Ebrahim Raisi | హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
TS TET | టీఎస్ టెట్ పరీక్షలు ప్రారంభం.. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

