AI | ఏఐతో జాబ్ మార్కెట్‌పై ప్రభావం.. 2034 నాటికి ఆ ఉద్యోగాలు ఉండవ్!
కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
- ఒకే సమయంలో వివిధ కంపెనీలకు పని చేసే రోజులు
- లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా
AI | న్యూఢిల్లీ, జూలై 26: కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి. టెక్ రంగంలోకి ప్రవేశించిన కృత్రిమ మేధ(ఏఐ)తో జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ తాజాగా భవిష్యత్తు ఉద్యోగాల తీరుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2034 నాటికి అంటే మరో పదేండ్లలో ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని, ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కు వచ్చి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లిపోయే ఉద్యోగాలు ఉండబోవని అంచనా వేశారు. రాబోవు రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే విధిని నిర్వర్తించబోరని తెలిపారు.
ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు. దీని వలన అవకాశాలతోపాటు సవాళ్లు కూడా ఉంటాయని ఆయన వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. ఇదే సమయంలో ఒకే వ్యక్తి తన నైపుణ్యం, ప్రతిభను వివిధ రంగాల్లో చూపడం వలన కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో ఆతిథ్య రంగం సహా అన్ని సెక్టార్లకు ఏఐ అనుసంధానం అవుతుందని హాఫ్మన్ అంచనా వేశారు. టెక్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్మన్ గతంలో వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సామాజిక మాధ్యమాలకు విపరీత ఆదరణ వస్తుందని, గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, కృత్రిమ మేధ విప్లవం రానున్నదని ఆయన ముందుగానే చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

