Niti Aayog | కేంద్ర బడ్జెట్లో వివక్ష.. నీతి ఆయోగ్ భేటీ బాయ్‌కాట్
బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలపై వివక్ష చూపిందని, మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
- సమావేశాన్ని బహిష్కరించిన దక్షిణాదితో పాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు
- గైర్హాజరు కానున్న ఏడుగురు సీఎంలు!
- కేంద్ర బడ్జెట్లో వివక్షపై నిరసన
- ‘సమాఖ్య వ్యవస్థకు తూట్లు’ అని విమర్శ
- రాష్ట్ర వ్యాప్త నిరసనలకు డీఎంకే పిలుపు
Niti Aayog | న్యూఢిల్లీ/చెన్నై/తిరువనంతపురం, జూలై 26: బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలపై వివక్ష చూపిందని, మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా శనివారం ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా భేటీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఇది కుర్సీ బచావో బడ్జెట్
బడ్జెట్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధులు కేటాయింపులు జరిపి.. విపక్ష పాలిత రాష్ర్టాలకు మొండిచేయి చూపడం ద్వారా కేంద్రం సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచిందని పలు రాష్ర్టాల సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో తమిళనాడును పూర్తిగా విస్మరించారని సీఎం స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడుకొనేందుకు ప్రజా కోర్టులో తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ కక్ష గట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో అసలు తెలంగాణ పదమే లేకపోవడం దారుణమన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్సీ బచావో బడ్జెట్(కుర్చీని కాపాడుకొనే బడ్జెట్)’గా అభివర్ణించారు. విపక్ష పాలిత రాష్ర్టాలపై బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నదని అన్నారు. కాగా, బడ్జెట్లో వివక్షను నిరసిస్తూ డీఎంకే పార్టీ శనివారం తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నది.
నేడు నీతి ఆయోగ్ సమావేశం
ప్రధాని మోదీ నేతృత్వంలోని శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ జరుగనున్నది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేసేందుకు ‘వికసిత్ భారత్@2047’పై ప్రధానంగా చర్చించనున్నట్టు అధికారిక ప్రకటన తెలిపింది. నీతి ఆయోగ్ పాలక మండలికి ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. అన్ని రాష్ర్టాల సీఎంలు, యూటీల ఎల్జీలు, పలువురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
నీతి ఆయోగ్‌ను రద్దు చేయాలి: మమత
నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని మళ్లీ ఉనికిలోకి తేవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘వాళ్లు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ప్రజల మద్దతు లేదు. విపక్ష రాష్ర్టాలను మోసం చేసి రాజకీయ పక్షపాత బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేకపోయినా ఉమ్మడి వేదికపై గళాన్ని వినిపించడాన్ని నా బాధ్యతగా భావించాను’ అని ఆమె అన్నారు. ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యల పట్ల చర్చించే అధికారం ఉండేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

