Smriti Irani | అమేథిలో ఓటేసిన స్మృతి ఇరానీ
Smriti Irani | కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన స్మృతి ఇరానీ (Smriti Irani) తన నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథి (Amethi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Smriti Irani | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన స్మృతి ఇరానీ (Smriti Irani) తన నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథి (Amethi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో నిల్చొనిమరీ ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వేయాలని పిలుపునిచ్చారు.
ఈ దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది.
#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024
Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP
— ANI (@ANI) May 20, 2024
Also Read..
PF Account | ఎగ్జెంప్టెడ్-అన్ఎగ్జెంప్టెడ్.. మీ పీఎఫ్ ఖాతాకున్న హోదా ఏంటి?
Ebrahim Raisi | ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు.. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాద స్థలం గుర్తింపు
Prasanth Varma | రణవీర్‌తో గప్‌చుప్‌గా షూటింగ్ మొదలైట్టిన హను-మాన్ డైరెక్టర్?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

