Agnipath scheme | అగ్నిపథ్ స్కీమ్‌పై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు.
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత ప్రొఫెషనల్ సైన్యాల్లో భారత్ ఒకటిగా పరిగణిస్తారని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రొఫెషనలిజాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు.
కేవలం 6 నెలలు శిక్షణతో మూడు నాలుగేండ్ల సర్వీస్‌కు సైనిక సిబ్బందిని పరిమితం చేస్తే శిక్షణలో నాణ్యత తగ్గుతుందని, భారత సైన్యానికి వృత్తిపరమైన అవకాశాలు సన్నగిల్లుతాయని శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మన సైనిక పాటవాన్ని దెబ్బతీస్తుందని తాను నమ్ముతానని, కేవలం పెన్షన్‌పై సొమ్మును ఆదా చేసేందుకు ఈ పధకాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఈ పధకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని తాను సమర్ధిస్తానని ఆయన పేర్కొన్నారు.
కాగా, అంతకుముందు అగ్నిపథ్ స్కీమ్(Agnipath Scheme)ను విమర్శిస్తున్న విపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. విపక్షాలు ఆర్మీని బలహీనపరుస్తున్నాయన్నారు. కొందరు వ్యక్తుల ఆలోచనలకు ఏమైందో తెలియడం లేదని, పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకు ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, కొత్తగా రిక్రూట్ అయిన వారికి పెన్షన్ అంశం 30 ఏళ్ల తర్వాత ఉత్పన్నం అవుతుందన్నారు. ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించామని, రాష్ట్రనీతి కోసం పనిచేస్తాం కానీ రాజనీతి కోసం కాదన్నారు.
Read More :
Syed Maqbool | దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

