IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోజురోజుకు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. పద్దినిమిదో సీజన్ సన్నద్ధతలో భాగంగా పలు జట్లు తమ హెడ్‌కోచ్‌లకు మంగళం పాడుతున్నాయి. ఢిల్లీ కాపిటల్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే రికీ పాంటింగ్‌ను సాగనంపింది. తాజాగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) సైతం ప్రధాన కోచ్‌గా ఉన్న ట్రెవొర్ బేలిస్(Trevor Bayliss)కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రంజీ వీరుడు వసీం జాఫర్ పంజాబ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో ఈ మాజీ ఓపెనర్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా, బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అందకని అనుభవజ్ఞుడైన అతడిని హెడ్‌కోచ్‌గా తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం. అయితే.. ఈ విషయాన్ని పంజాబ్ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
🚨📰Wasim Jaffer is set to become the next Head Coach of the Punjab Kings
(Indian Express)#INDvBAN #SLvsIND #IPL2025 #TravisHead #JaspritBumrah #MLC2024 #TheHundred pic.twitter.com/KkM5VaBu1u
— Cricketism (@MidnightMusinng) July 26, 2024
ఐపీఎల్లో బలమైన జట్టుగా పేరొందిన పంజాబ్ కింగ్స్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. బాలీవుడ్ నటి ప్రీతి జింతా సహ యజమానిగా ఉన్న పంజాబ్ .. 17 ఏండ్లలో ఓసారి ఫైనల్ చేరినా టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. యువరాజ్ సింగ్, మహేల జయవర్ధనే, జార్జ్ బెయిలీ, అశ్విన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్.. ఇలా సారథులను మార్చినా జట్టు రాత మాత్రం మారలేదు.

దాంతో, ఈసారి హెడ్‌కోచ్‌ను పక్కన పెట్టేయాలని మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. రంజీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వసీం జాఫర్‌ను కోచ్‌గా నియమించేందుకు పావులు కదుపుతోంది. 2019 నుంచి 2021 వరకు జాఫర్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.
అనంతరం 2023లో మళ్లీ బ్యాటింగ్ కన్సల్టెంట్గానూ ఫ్రాంచైజీకి సేవలందించాడు. శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ జట్టు 17వ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆదిలో రెండు విజయాలతో జోరు చూపించినా.. ఆ తర్వాత డీలా పడింది.

అయితే.. బ్యాటింగ్‌లో కుర్రాళ్లు అషుతోష్ శర్మ, శశాంక్ సింగ్‌లో మెరుపులతో ఆఖర్లో మళ్లీ గెలుపు తోవ తొక్కినా.. ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. చివరకు పంజాబ్ తొమ్మిదో స్థానంతో ఉసూరుమనిపించింది. అందుకని 18వ సీజన్‌కు పకడ్భందీగా సిద్ధమవ్వాలిని ఫ్రాంచైజీ భావిస్తోంది. అందులో భాగంగానే జాఫర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించేందుకు మేనేజ్మెంట్ ఓకే చెప్పినట్టు టాక్.