Somireddy Chandra Mohan Reddy | ప్రతిపక్షంలో ఉండే ధైర్యం జగన్‌కు లేదు.. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Somireddy Chandra Mohan Reddy | జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టారని ఆరోపించారు.
Somireddy Chandra Mohan Reddy | జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టారని ఆరోపించారు. నెల్లూరు కోర్టులో కాకాణి ఫైల్స్ దొంగతనాలు చేయించారని ధ్వజమెత్తారు.
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనలో మిథున్ రెడ్డి తనకు సంబంధం లేదని అంటున్నారని.. మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. చేసిన పాపాలకు శిక్ష తప్పదని, ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రతిపక్షంలో ఉండే ధైర్యం వైసీపీ నేతలకు లేదని సోమిరెడ్డి విమర్శించారు. అందుకే అధికారం కోసం, తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి వాళ్లు బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారని అన్నారు. కానీ అది కాస్త బెడిసికొట్టిందని చెప్పారు. ఇండియా కూటమిలో చేరే ధైర్యం జగన్ దగ్గర లేదని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని సోమిరెడ్డి ఆరోపించారు. శ్వేతపత్రాలపై మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమైందని.. నిజాయితీగా మాట్లాడటానికి ఒక్కరు చాలరా అని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

