Stocks | బ్లూచిప్ స్టాక్స్ దన్నుతో రికార్డు గరిష్టాలతో ముగిసిన ఇండెక్సులు.. రూ.7.16 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
Stocks | రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదు వరుస సెషన్లలో నష్టాల తర్వాత శుక్రవారం లాభాలతో ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల నష్టాల నుంచి బయట పడ్డాయి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంపు పేరుతో విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించగా, ఇతర ఇన్వెస్టర్లు స్టాక్స్ విక్రయించారు. కానీ, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ వంటి ప్రధాన బ్లూ చిప్ స్టాక్స్ తక్కువ ధరల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్సుల్లో రికవరీ ప్రారంభమైంది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1292 పాయింట్లు (1.62శాతం) లబ్ధితో 81,332 పాయింట్ల వద్ద ముగిస్తే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 428 పాయింట్లు (1.76శాతం) పుంజుకుని 24,834 పాయింట్ల రికార్డు గరిష్టానికి చేరుకుని స్థిర పడింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.16 లక్షల కోట్లు పెరిగి రూ.456.98 లక్షల కోట్లకు పెరిగింది.
బీఎస్ఈ-30లోని భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ తదితర స్టాక్స్ 4-3 శాతం మధ్య పుంజుకుంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా స్టాక్స్ మోస్తరుగా నష్టపోయాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో శ్రీరాం ఫైనాన్స్ తొమ్మిది శాతం లాభ పడితే సిప్లా, దివిస్ ల్యాబ్స్ పుంజుకున్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాలతో ముగిశాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 81.95 డాలర్లు, ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర 2372 డాలర్లు పలుకుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

