Operation smile | మెదక్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు . శనివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో బాల కార్మికుల విముక్తి పోస్టర్లు ఆవిష్కరించారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించడం, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు చేర్చడం, అనాథ పిల్లలకు పునరావాసం కల్పించడమే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.బాలల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి జనవరి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డియస్పి రంగా నాయక్, ఎస్బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, ఆర్ఎసై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం