Samajwadi Party chief | వ్యవస్ధలను నిర్వీర్యం చేశారు : కాషాయ పాలకులపై అఖిలేష్ యాదవ్ ఫైర్
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఢిల్లీ వైఫీకి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పాస్‌వర్డ్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇలాగేనా నడిపేదని ఆయన ప్రశ్నించారు. యూపీని ఇలా పాలించరాదని పేర్కొన్నారు. కాషాయ పాలకులు యూపీ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు.
ఎస్పీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, తమ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.కేంద్ర బడ్జెట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరిచేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారని, తెలంగాణ, పంజాబ్, హరియాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలను విస్మరించారని మండిపడ్డారు.
బెంగాల్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఇది కేవలం కుర్చీని కాపాడుకునే బడ్జెట్ మాత్రమేనని దుయ్యబట్టారు.అగ్నివీర్ పధకంపై ప్రధాని మోదీ ప్రకటనను ప్రస్తావిస్తూ ఇది యువతకు వారి కుటుంబాలకు ఎలాంటి మేలు చేసే పధకం కాదని విమర్శించారు. ఇక దేశంలో అత్యంత ప్రముఖ నేతల్లో మమతా బెనర్జీ ఒకరని అనడంలో ఎలాంటి సందేహం లేదని శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో మమతా బెనర్జీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తారని చెప్పారు.
Read More :
YS Jagan | చంద్రబాబువి గోబెల్స్ ప్రచారం.. ప్రజలను మోసం చేయడమే ఆయన పని : వైఎస్ జగన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

