YS Jagan | చంద్రబాబువి గోబెల్స్ ప్రచారం.. ప్రజలను మోసం చేయడమే ఆయన పని : వైఎస్ జగన్
YS Jagan | వైసీపీ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
అమరావతి : వైసీపీ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు(Chandra Babu) శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను దాచి అసత్య ప్రచారంతో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్లు అప్పుచేశారని ఆరోపించిన టీడీపీ(TDP) , గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులని వినిపించారని దుయ్యబట్టారు. వాస్తవానికి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు రూ. 5.18 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రోజు రూ. 100 కోట్లు మాత్రమే నిలువ ఉందని గుర్తు చేశారు.
మేనిఫెస్టో (Manifesto) లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని, డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ. 2.71 లక్షల కోట్లు లబ్దిదారులకు జమ చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలిసి వస్తుందన్న భయంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టడం లేదో వెల్లడించాలని జగన్ డిమాండ్ చేశారు.
పిన్నెల్లి అమాయకుడు..
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణుడు అమాయడని జగన్ పేర్కొన్నారు. అతడిపై అక్రమంగా కేసు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను దారుణంగా చంపివేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. నారా లోకేష్ ఏకంగా రెడ్‌బుక్ ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో చెప్పాలని వివరించారు.
Read more :
Chandra Babu | వైసీపీ పాలన వల్ల ఏపీకి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గింది : చంద్రబాబు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

