YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించింది.
వివేకా హత్య కేసులో A-4గా ఉన్న నిందితుడు దస్తగిరి గతంలో అప్రూవర్‌గా మారాడు. దీంతో ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారినందున తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనను సాక్షిగా మాత్రమే చూడాలని కోరారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు దస్తగిరికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
వివేకా మర్డర్ కేసులో కీలక నిందితుడైన దస్తగిరి పేరును నిందితుల జాబితా నుంచి తొలగించి.. సాక్షిగా పరిగణించేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది.