Chandra Babu | వైసీపీ పాలన వల్ల ఏపీకి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గింది : చంద్రబాబు
Chandra Babu | గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి : గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu ) ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్ని(White Papaer) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను (Central Funds) సైతం మళ్లించారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల నిధులను కొట్టేశారు. పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తులను, విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని విమర్శించారు.
పోలవరం (Polavaram) పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని అన్నారు. రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు పేర్కొన్నారు.
ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 9. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. 2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

