Cancer | భారత్‌లో ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. లోక్‌సభకు వెల్లడించిన జేపీ నడ్డా
Cancer | భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
Cancer | భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరలో చికిత్స, మందులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) జేపీ నడ్డా లోక్‌సభకు తెలిపారు.
శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో ఏటా 15.5 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు సభకు వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల ధరలను (cancer medicines) ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తోందని తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు ఏటా రూ.294 కోట్లు ఆదా అవుతోందన్నారు.
ఇక హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పారు. ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని వివరించారు. వైద్య విద్య యొక్క నాణ్యత, పరిమాణంలో సమతుల్యత ఉండాలన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 731కి పెరిగినట్లు చెప్పారు. ఇక అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 72,627కు పెరిగినట్లు వివరించారు.
Also Read..
Gangster | జైలు నుంచి విడుదలై ‘కమ్ బ్యాక్’ ర్యాలీ.. మళ్లీ కటకటాలపాలైన గ్యాంగ్‌స్టర్
Uttarakhand | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. వంతెన కొట్టుకుపోవడంతో చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
Joe Biden | జో బైడెన్ ఆరోగ్యం అద్భుతంగా ఉంది.. స్పష్టం చేసిన వైట్ హౌస్ వైద్యుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

