Gangster | జైలు నుంచి విడుదలై ‘కమ్ బ్యాక్’ ర్యాలీ.. మళ్లీ కటకటాలపాలైన గ్యాంగ్‌స్టర్
Gangster | జైలు (Prison) నుంచి విడుదలైన ఆనందంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ గ్యాంగ్ స్టర్ (Gangster) ఇప్పుడు కోరి సమస్యలను కొని తెచ్చుకున్నాడు.
Gangster | జైలు (Prison) నుంచి విడుదలైన ఆనందంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ గ్యాంగ్ స్టర్ (Gangster) ఇప్పుడు కోరి సమస్యలను కొని తెచ్చుకున్నాడు. కేసు నుంచి బయటపడ్డానన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే మరోసారి కటకటాలపాలయ్యాడు.
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ (Harshad Patankar) హత్యాయత్నం, దొంగతనాలు వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. అయితే, జులై 23వ తేదీన అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ (Comeback Rally) ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Also Read..
Joe Biden | జో బైడెన్ ఆరోగ్యం అద్భుతంగా ఉంది.. స్పష్టం చేసిన వైట్ హౌస్ వైద్యుడు
Uttarakhand | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. వంతెన కొట్టుకుపోవడంతో చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
Supreme Court | కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

