Uttarakhand | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. వంతెన కొట్టుకుపోవడంతో చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు.
తాజాగా రుద్రప్రయాగ్ జిల్లాలోని మద్మహేశ్వర్ ఆలయం (Madmaheshwar Temple) సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు (50 pilgrims stranded) స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఆలయానికి వెళ్లిన భక్తులు అక్కడ చిక్కుకుపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ప్రజలు కొండ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read..
Joe Biden | జో బైడెన్ ఆరోగ్యం అద్భుతంగా ఉంది.. స్పష్టం చేసిన వైట్ హౌస్ వైద్యుడు
Supreme Court | కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

